నలుగురికీ హితం చేకూర్చే ధర్మం కోసం కాకుండా ఒక ప్రభువు కోసం పోరాడవలసి రావడంలోని నరకమే లఘుగీతాల్లో మనకు కనిపిస్తున్నది.
యుగయుగాల చీనా కవిత-1
ప్రాచీన చీనా సాహిత్యం మౌఖిక రూపం నుంచి లిఖిత రూపానికి పరివర్తన చెందే కాలంలో, పౌరాణిక కాలం నుంచి చారిత్రిక యుగాల్లోకి ప్రవేశిస్తున్న కాలంలో రూపుదిద్దుకున్న గీతాలు అవి. అందులో ప్రాచీన చైనా సంపూర్ణంగా కనిపిస్తుంది.
జీవితాశయం
జీవితాశయమంటే ఏమిటి? జీవితసాఫల్యం రేపెప్పుడో సాధించవలసిన ప్రణాళిక మీద, మనం కన్న కలలో, కూర్చుకున్న తలపులో సఫలం కావడం మీద ఆధారపడిందా లేక ఇప్పుడే, ఇక్కడే మన జీవితాన్ని మనం నిండుగా స్వీకరించడం మీద ఆధారపడిందా?
