కొండవీడు-1

నాకు చరిత్ర పట్ల ఆసక్తి లేదు. చరిత్ర ఎక్కడ పద్యంగా రూపుదిద్దుకుంటుందో ఆ స్థలాలపట్లనే నాకు మక్కువ. చరిత్రని దాటి ఎక్కడ పద్యం నిలబడుతుందో ఆ తావులకోసమే నేను తపిస్తాను. అక్కడ కొండవీడు ఘాట్ రోడ్ మలుపు తిరుగుతుండగా, రోడ్డుమలుపు తిరిగే గోడ మీద శ్రీనాథుడి పద్యమొకటి, ఈ మధ్యనే అక్కడ రాసిపెట్టింది, చప్పున నా దృష్టిని ఆకర్షించింది.