మనం కూడా ప్రపంచ సాహిత్యం చదువుతాం. కాని రాజారావులాంటి వాళ్ల పఠనానుభవం కేవలం ఒక పాఠకుడి అనుభవం కాదు, అది ఒక తీర్థయాత్రీకుడి అనుభవం. ఒక ఆధ్యాత్మిక సాధకుడి అనుభవం.
ఆషాఢమేఘం-26
చాలామందికి తాము ఉటంకిస్తున్నది భర్తృహరి వాక్యాలని తెలియకపోయినా జీవితంలో కనీసం ఒక్కసారేనా భర్తృహరి సుభాషితాల్లోంచి ఒక్క వాక్యమేనా ప్రస్తావించకుండా ఉండరు. ప్రజల నాలుక మీద నానడంలో సంస్కృత కవుల్లో భర్తృహరి తర్వాతే ఎవరేనా.
ఆషాఢమేఘం-22
ఇది కదా, ఒక కవిని కన్నందుకు, ఆ ఊరికి లభించే భాగ్యం! మరో కవి ఎవరేనా ఉన్నారా? ఇలా ఒక మేఘాన్ని తన ఊరికి ఆహ్వానించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండీ మరీ చూపించడానికి ఉత్సాహపడ్డ కవి!
