బైరాగి రాసిన రాస్కల్నికోవ్ కవితకు భావార్థం ఇది. శుక్రవారం ఈ కవితమీద ప్రసంగించబోతున్నాను కాబట్టి ఈ భావార్థాన్ని ముందే చదువుకోడానికి వీలుగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. మూల కవిత చూడాలనుకున్నవాళ్ళు సోమశేఖరరావు వాల్ మీద చూడవచ్చు.
ఈశ్వర స్తుతిగీతాలు-3
అయితే, దేవుడు తన మొరాలకిస్తున్నాడనే నిశ్చయ జ్ఞానం, ఒక అచంచల విశ్వాసం ఈ గీతాలకి ప్రాణం. అందుకనే కొన్ని చోట్ల అవి ఫిర్యాదులుగా, రక్షణకోసం ఆక్రందనలుగా వినబడుతున్నప్పుడు కూడా, ఆ విశ్వాసం చెక్కుచెదరకపోవడం మనం చూడవచ్చు.
పునర్యానం -17
ఆ తర్వాత మూడేళ్ళ పాటు నా రాజమండ్రి జీవితాన్ని ఆ పుస్తకం వెలిగించింది. ఒక మనిషికి ఒక పుస్తకం తోడుగా ఉండటమనేది సాధారణంగా మనం మతగ్రంథాల విషయంలోనే చూస్తాం. కాని అరుదుగా సాహిత్య గ్రంథాలు కూడా అటువంటి చోటు సంపాదించుకోగలవని ఆగమగీతి నా జీవితంలో ప్రవేశించాకే అర్థమయింది.
