ఒక సజీవ తార్కాణ

విద్య పరమార్థం ఏదో ఒకటి నేర్పడం కాదు, నేర్చుకోవడమెట్లానో నేర్పడం అనే మాట నిజమైతే, ఆ లక్ష్యానికి తాడికొండ ఒక సజీవ తార్కాణ.

కొన్ని కలలు, కొన్ని మెలకువలు

వాడ్రేవు చినవీరభద్రుడు జిలా గిరిజన సంక్షేమాధికారిగా 1987 నుంచి 1995 దాకా విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలు, అదిలాబాదుజిల్లాల్లో పనిచేసిన కాలంలో ప్రాథమికవిద్యను గిరిజనప్రాంతాల్లో సార్వత్రీకరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. 1995 నుంచి 1997 మధ్యకాలంలో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆ ప్రయత్నాలకొక సమగ్రరూపాన్ని సంతరించి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ అనుభవాల్లో ఆయన సాఫల్యవైఫల్యాలను వివరించే రచన 'కొన్ని కలలు, కొన్ని మెలకువలు.'

హీరాలాల్ మాష్టారు

నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: 'భద్రుడూ, నాన్నగారు ఇక లేరు. 'అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.