రిచర్డ్‌ రైట్‌

కమ్యూనిస్టుగా, ఆ తర్వాత ఫ్రాన్సులో సార్త్రేకి, సైమన్‌ డి బోవాకి స్నేహితుడిగా, చివరికి ఫ్రాన్సు వదిలిపెట్టి ఇంగ్లాండులో తనకి ఆశ్రయం వెతుక్కున్నవాడిగా, కమ్యూనిజంతో తెగతెంపులు చేసుకుని, ఆసియా, ఆఫ్రికా దేశాల వైపు చూపు సారించినవాడిగా, రైట్‌ ప్రపంచమంతా చేసిన ప్రయాణం అతణ్ణి పాల్‌ రోబ్సన్‌ వంటివారి కోవలో నిలపగలిగేదని నిశ్చయంగా చెప్పగలం.

జార్జి మోసెస్‌ హోర్టాన్‌

అతడి జీవితంలో నిజంగా దుర్భరమైన అధ్యాయం అంటే ఇదే. అతడు తన తొలి కవిత్వం 1829 లో అచ్చువేసుకుంటే, ఆ తర్వాత ముప్ఫై ఏళ్ళకు పైగా అతడిరకా బానిసగానే జీవించవలసి రావడం. తాను బానిసగా జీవిస్తున్నాడు అనే చైతన్యం లేకపోయి ఉంటే, ఆ నరకం వేరు. కాని తాను బానిసగా జీవించవలసి వస్తూండటాన్ని తన మనసూ, బుద్ధీ కూడా అంగీకరించడం లేదని తెలిసాక కూడా ఆ జీవితమే జీవించవలసి రావడంలోని నరకం మన ఊహకి కూడా అందేది కాదు.

వికసించిన విద్యుత్తేజం

ప్రతి ఏడాదీ ఫిబ్రవరి నెలపొడుగునా అమెరికాలో, కెనడాలో జరుపుకునే నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని 2018 లో ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యం పైన కొన్ని పరిచయ వ్యాసాలు రాసాను. వాటిలో డగ్లస్‌, డన్‌బార్‌, లాంగ్‌స్టన్‌ హ్యూస్‌, పాల్‌ రోబ్సన్‌ మీద వ్యాసాల్ని ఇప్పుడు కొద్దిగా విస్తరించాను. వారితో పాటు ఫిల్లిస్‌ వీట్లి, జార్జి మోజెస్‌ హోర్టాన్‌, రిచర్డ్‌ రైట్‌ల మీద కొత్తగా రాసిన వ్యాసాలు ఈ సంపుటిలో చేర్చాను. ఇప్పుడు ఈ పదిహేను వ్యాసాల్నీ 'వికసించిన విద్యుత్తేజం' పేరిట ఈ ఫిబ్రవరి నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఇలా విడుదల చేస్తున్నాను. ఇది నా 55 వ పుస్తకం. ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యం వైపు నా దృష్టి మళ్ళించిన నా ఆత్మీయుడు కన్నెగంటి రామారావుకు ఈ పుస్తకాన్ని ప్రేమతో కానుక చేస్తున్నాను.