ఆ మాటలు వింటుంటే నాలో కొత్త రక్తం ఎక్కినట్టుగా ఉంది. నా చిన్నప్పణ్ణుంచీ, స్కూల్లో, కాలేజిలో ఎవరూ ఇటువంటి మాటలు చెప్పడం వినలేదు. ఈ దేశంలో కొన్ని వేల ఉన్నతపాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది కనీసం కొన్ని వేలమంది విద్యార్థులైనా ఇలా గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉండి, ఎంతో కొంత మార్పు తేగలిగితే, దేశం ఎలా ఉంటుందో అనిపించింది.
ఆ వెన్నెల రాత్రులు-16
నిజానికి భాష మెటఫరికల్ గా ఉన్నప్పుడే చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది. కాని సైంటిఫిక్ లాంగ్వేజి, లీగల్ లాంగ్వేజి మెటఫరికల్ గా ఉంటే కుదరదు. ఒకటి పట్టుకుంటే రెండోది వదిలెయ్యాలి. కాని ఐ యామ్ ఎ లిటిల్ బిట్ ఎరాటిక్. నా కళ్ళకి సైన్సు కావాలి, చెవులకి కవిత్వం కావాలి.
ఆ వెన్నెల రాత్రులు-15
ప్రతి మనిషీ తన జీవితంలో ఒకసారేనా, కనీసం ఒక రోజేనా ఒక కొండ పక్కనుంచి నడిచి వెళ్ళకుండా ఉండడు. ఒక కొండకింద పల్లెలోనో, పట్టణంలోనో బసచెయ్యకుండా ఉండడు. కానీ జీవితంలో ఒకసారేనా, కనీసం ఒక గంటపాటేనా ఫాల్గుణమాసపు అడవి దారిన నడిచే అవకాశం దొరికినవాళ్ళ భాగ్యమే భాగ్యమని చెప్పగలను.
