అవధూత గీత

కిందటి అక్టోబరు-నవంబరు నెలల్లో అవధూత గీతకు నా తెలుగు అనువాదాన్నీ, ఆ గీతను ఉపదేశించిన దత్తాత్రేయుల దర్శనం పైన కొన్ని ఆలోచనల్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అనువాదాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను. ఈ అనువాదాన్ని గాణ్గాపురంలోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి నిర్గుణపాదుకలముందు సమర్పిస్తున్నాను. ఇది నా 57 వ పుస్తకం.

ఇన్విక్టస్ మరికొన్ని సినిమాలు

ఆయన మాటలు విన్నాక ఈ పదేళ్ళుగా చలనచిత్రాలమీద నేనేం రాసానా అని చూస్తే 34 సమీక్షలు కనబడ్డాయి. వాటితో పాటు ఎడిటింగ్ మీద వచ్చిన ఒక పుస్తకం మీద రాసుకున్న సమీక్ష కూడా కనిపించింది. దాంతో ఆ 35 వ్యాసాలూ ఇలా గుదిగుచ్చి 'ఇన్విక్టస్ మరికొన్ని సినిమాలు' పేరిట ఇలా ఈ బుక్ గా అందిస్తున్నాను. ఇది నా 53 వ పుస్తకం. ఇది మీకు నా కొత్త సంవత్సరం కానుక. మీరు కూడా మీ మిత్రులతో ఈ కానుకని పంచుకుంటారని ఆశిస్తున్నాను.

లోపలి దారి

. ఒకసారి అతడు నన్ను ఆర్మూరులో వాళ్ళ అక్కగారి ఇంటికి తీసుకువెళ్ళాడు. తన తల్లిదండ్రుల్ని పరిచయం చేసాడు. వాళ్ళ నాన్నగారు రాజులు గారిని చూడగానే ఆయన ఒక కర్మయోగి అని గుర్తుపట్టగలిగాను. ఆ యోగవశిష్టుడి యోగవాశిష్టమే గంగారెడ్డికి దక్కిందని అర్థమయింది.