పదవతరగతి పిల్లల్లో మాటాడుతూ తమ కెరీర్ గురించి వాళ్ళకెట్లాంటి ఊహలున్నాయో ఒక్కొక్కరినీ అడిగాను. అందరిలోకీ, ఆశ్చర్యం, ఒకమ్మాయి ఆర్మీలో చేరాలన్నది తన కల అని చెప్పింది. నేనున్న కొద్దిసేపట్లోనే ఆ పిల్లలు వాళ్ళ ప్రతిభ, సాధన, సంతోషం మొత్తం నా ముందు కుమ్మరించడానికి పోటీ పడ్డారు. ఆ పిల్లల ఉత్సాహం మధ్య నాకు సమయం తెలియలేదు. చాలా కాలం తర్వాత మళ్ళా నాలో కొత్త రక్తం ప్రవహించినట్టుగా ఉంది.
మోహనరాగం: విద్య
మనకి కావలసింది మనుషుల్ని రూపొందించే విద్య అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో
ట్రివియం
కానీ, ఆ గ్రీకు గ్రంథాల్ని మధ్యయుగాల విద్యార్థులు ఏ పద్ధతిలో చదివారు? వాటిని వారికెవరు బోధించారు? ఏ బోధన-అభ్యసన ప్రక్రియ వల్ల లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, బొకాషియో, డాంటే, షేక్ స్పియర్, గెలీలియో, బ్రూనో లు రూపొందారు? ఏ విద్యాబోధన పునాదులమీద తదనంతర కాలాల్లో ఫ్రాన్సిస్ బేకన్,న్యూటన్, వోల్టేర్, డెనిస్ డిడిరో, గొథే, సెర్వాంటిస్ లు ప్రభవించగలిగారు?
