నేనూ రచయితనే కాబట్టి, సరిగ్గా, అప్పుడే, ఆ కథకి ఆ చిన్నారి బాలికలు ఏమి మలుపు ఇవ్వబోతున్నారని కుతూహలంగా ముందుకు వంగి ఆసక్తిగా మరు సన్నివేశం కోసం చూపు సారించాను. ఆ పైన చెప్పబోయే వాక్యాల కోసం ఆతృతగా చెవులు రిక్కించాను.
ఢిల్లీ పాఠశాలలు
ఒక సమాజంలో పాఠశాలలు పరివర్తన చెందాలంటే, అక్కడ రాజకీయనాయకులు, పాత్రికేయులు, తల్లిదండ్రులు, ఉపాధాయులు, ఎవరేనాకానీ, నలుగురు కలిసినప్పుడల్లా పాఠశాలల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. ఒకరినుంచి ఒకరు ఉత్సాహం పొందుతుండాలి, ఒకరినొకరు అభినందించుకోవాలి. ఒకరినొకరు ముందుకు నడుపుకుంటూ ఉండాలి.
నాడు, నేడు
నాకు అప్పుడు బడి అంటే భవనమనీ, సదుపాయాలనీ ఆలోచన లేదనిపిస్తుంది. బడి అంటే మా వజ్రమ్మ పంతులమ్మగారు. అంతే. ఆమెని చూసే చింగిజ్ అయిత్ మాతొవ్ 'తొలి ఉపాధ్యాయుడు' పుస్తకం రాసి ఉంటాడు. ఆమె నేను చూసిన పరిపూర్ణ క్రైస్తవురాలు. కాని నాకు రామాయణం, మహాభారతం చెప్పిన తొలి గురువు కూడా ఆమెనే.
