అటువంటి దృక్పథాన్ని తనకై తాను ఏర్పరచుకునే క్రమంలో బుచ్చిబాబు కథానికా ప్రక్రియ గురించీ, కథకుడి అంతరంగం గురించీ కూడా కొంత అనుశీలన చేసాడు. కొత్తగా కథలు రాస్తున్న రచయితలకీ, చాలా కాలంగా రాస్తున్న రచయితలకీ కూడా ఆ అనుశీలన కొంత అంతర్దృష్టిని ప్రసాదిస్తుంది.
పోరాటకారుడు
ఉన్నతస్థానాల్లో ఉన్న అవినీతిని ఎత్తిచూపాలన్నది ప్రతి ఒక్కరూ చెప్పేదే గాని, ఆ ఉన్నతస్థానాలు తమ దైనందిన జీవితంలో భాగమయినప్పుడు పోరాటం చేసేవాళ్ళు మనకేమంత ఎక్కువమంది కనబడరు. ఎక్కడో ఉన్న పాలకుల్ని విమర్శించడం చాలా సులువు. కాని, నీ కార్యాలయంలో నువ్వెవరికింద పనిచేస్తున్నావో వాడి అవినీతిని ప్రశ్నించడం చాలా కష్టం. రూపురేఖల్లేని 'రాజ్యం' అనే ఒక శక్తిని విమర్శించడం చాలా సులువు. కానీ, నీ స్థానిక శాసనసభ్యుణ్ని విమర్శించడం చాలా కష్టం.
అజంతాగారు
అట్లాంటి రోజుల్లో విజయవాడ వెళ్ళినప్పుడు, జగన్నాథ రావుగారు నన్నొక హాస్పటల్ కి తీసుకువెళ్ళారు. అక్కడొక బెడ్ మీద పడుకుని ఉన్న బక్కచిక్కిన మనిషిని చూపిస్తూ 'ఈయనే అజంతా గారు' అన్నారు. ఆ బెడ్ మీద ఆయన పక్కనే ఒకటిరెండు కవిత్వపుస్తకాలు ఇంగ్లీషులో.
