దురదృష్టవశాత్తూ మనం సాధన చేస్తున్నది రాజీపడకుండా మన అభిప్రాయాల్ని నిలబెట్టుకోవడమెలా అన్నది. కాని నిజంగా కావలసింది, రాజీ పడినా సరే, ప్రేమించడమెట్లా అన్నది. చలంగారు జీవితకాలం చేసింది అదే.
ఎర్రాప్రగడ
ఇప్పుడు ఏ మిగలముగ్గిన తాటిపండుని చూసినా ఎర్రాప్రగడ గుర్తుకు వస్తాడు. ఎర్రన రాసిన ఏ పద్యం చదివినా చెట్టుమీదే పండి చుట్టూ గాలిని సురభీకరించే తాటిపళ్ళు గుర్తొస్తాయి.
ఆ బంభర నాదం
అలా ఒక రసజ్ఞుడు ఎలుగెత్తి, మేఘగంభీర స్వరంతో పద్యాలు చదువుతోంటే, భయంతో, భక్తితో, వినమ్రతతో అట్లా ఆ రోజు రాజమండ్రి ఆ ఉద్గాత ముందు చెవి ఒగ్గినిలబడిపోయినట్టుగా ఇప్పుడు ఏ పట్టణమేనా చెవి ఒగ్గడానికి సిద్ధంగా ఉందా? ఏమై పోయింది ఆ కాలం? ఆ రసజ్ఞులు? తే వందినః? తాః కథాః?
