కాని నా వరకు నేను సీసమనే అంటాను. అవును, పదహారణాల తెలుగు ఛందోవిశేషం సీసపద్యమే. తెలుగు పద్యరూపాలన్నిటిలోనూ పెద్దది కావడం వల్లనే కాదు, అంత versatility ఉన్న ఛందస్సు ప్రపంచభాషల్లోనే మరొకటి కనిపించదు.
ఊర్ణనాభి
విశ్వనాథ ఈ అర్థాన్ని మరింత వివరంగా 'నీవ నిర్మించుకొందువు నిన్ను కట్టు త్రాళ్ళ వానిని కర్మసూత్రములన్ తెంపు' అన్నాడు. 'నీవ' అనే మాట గమనించదగ్గది. నీవ అంటే 'నువ్వు మాత్రమే' అని.
చాసో
కవిగా చాసో సాధించిన అద్భుతమైన పరిణతి 'మాతృధర్మం' కథలో కనిపిస్తుంది. చలంగారి 'ఓ పువ్వు పూసింది' రొమాంటిసిస్టు సంప్రదాయంలోంచీ, 'మాతృధర్మం' రియలిస్టు సంప్రదాయంలోంచి వికసించినా రెండూ కూడా ఒక్కస్థాయినే అందుకున్న కథలు. ఆ కథలతో తెలుగుకథ శిఖరాగ్రాన్ని చేరుకుంది
