ప్రాచీన కథారూపాలు ఆధునిక కథగా రూపొందిన ఈ అత్యంత ఆసక్తికరమైన ఈ ప్రయాణంలో ఎన్నో జాతులు, ఎన్నో సార్థవాహ బృందాలు, ఎన్నో మత యుద్ధాలు, ఎందరో సన్న్యాసులు, విరాగులు, ధార్మికులు, కపటులు, జూదరులు, మోసగాళ్ళు, చివరికి దొంగలు, వ్యభిచారులు, నేరస్థులు కూడా పాల్గొన్నారు.
మాఘపురాణం
మాఘమాసపు మధ్యాహ్నం. నదికి ఆవలా ఈవలా పొదల్లో పొలాల్లో తోటల్లో తలుపులన్నీ బార్లా తెరిచిపెట్టారు.
రెండో చరణం
నిండుగా పూసిన ప్రతి మామిడి చెట్టూ నేను పోగొట్టుకున్న దాన్ని నేను నిజంగా పోగొట్టుకోలేదనే చెప్తుంది.
