కుల్దీప్ సలిల్ Great Urdu Rubais, Qatas and Couplets ( హింద్ పాకెట్ బుక్స్, 2013) ఒక్క పూటలోనే పూర్తిచేసేసాను. అతడే ఇంతకు ముందు తీసుకువచ్చిన Great Urdu Ghazals (2011), Great Urdu Nazms ( 2013) ఈ సంకలనం అందమైన, అర్థవంతమైన కొనసాగింపు.
ద్రోణపర్వం
మహాభారతం చదువుతున్నాను. ద్రోణపర్వం. అటువంటి యుద్ధవర్ణన, యుద్ధగమన చిత్రణ,అట్లా రోమాంచితంగా కథచెప్పగలిగే నేర్పు మరే రచయితలోనూ నేనింతదాకా చూడలేదు. హోమర్ ఇలియడ్ లో చేసిన యుద్ధవర్ణన, టాల్ స్టాయి ఏడేళ్ళ పాటు శ్రమించి చిత్రించిన నెపోలియన్ దండయాత్ర కూడా ఈ వర్ణనముందు పసిపిల్లల రాతల్లా కనిపిస్తున్నాయి.
అటువంటి సారథి కావాలి
రెండురోజుల కిందట. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే హడావిడి. విజ్జి అన్నం వడ్డించింది. కాని నా మనసులో కర్ణపర్వంలో శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలే పదేపదే వినిపిస్తున్నాయి. ఘటోత్కచవధ అయిన తరువాత ఆయన సంతోషం ఆపుకోలేకపోయాడు.
