మండూకసూక్తం

జ్వరం తగ్గింది గానీ, నీరసం. బయట అకాశమంతా ఆవరించిన శ్రావణమేఘాలు. కనుచూపుమేరంతా నేలనీ, నింగినీ కలిపి ఏకవస్త్రంగా కుట్టిపెట్టిన ముసురు. రాత్రవగానే నా కిటికీపక్క వానచినుకులసవ్వడి. ఇప్పుడేదో వినవలసిన చప్పుడొకటి మిగిలిపోయింది. ఏమిటది?

ముళ్ళదారి

మహాత్మాగాంధీ పెద్దకొడుకు హరిలాల్ గాంధీ జీవితం మీద చందూభాయి భాగూభాయి దలాల్ గుజారాతీలో ఒక పుస్తకం రాసారు. దాన్ని త్రిదీప్ సుహృద్ ఇంగ్లీషులోకి Harilal Gandhi: A Life (ఓరియెంట్ లాంగ్మన్,2007) అనువదించారు. దాదాపు రెండేళ్ళనుంచీ ప్రొ. రఘురామరాజు ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించమని నన్ను పట్టుపడుతూ ఉన్నారు.

సత్యశోధన

రెండురోజులకిందట గాంధీజీ ఆత్మకథ గురించి నాలుగు వాక్యాలు రాయకుండా ఉండలేకపోయానేగాని, నిజానికి ఆ పుస్తకం గురించీ, గాంధీజీ జీవితం గురించీ నా మనసులో కదలాడుతున్న భావాలన్నిటికీ నేను అక్షరరూపం ఇవ్వలేకపోయాను.