సరసిన దినచర్య రాసిన మహిళ కులీన కుటుంబాలకు చెందిన మహిళ. సాహిత్యాస్వాదన, సౌందర్యోపాసన, కళాభిరుచి, అపారమైన జీవితేచ్ఛ లు మేళవించిన మనిషి. అన్నిటికన్నా ముఖ్యం, చిన్నప్పణ్ణుంచీ కథల్నీ, కథలప్రపంచాన్నీ ప్రేమించి, ఆ ప్రపంచంలోకి దూకాలని తపించిన మనిషి.
స్వర్గం అంచుదగ్గర
పాడేరు కొండలమీద ప్రయాణించినప్పుడల్లా ప్రాచీన చైనా కవిత్వంలో ప్రయాణించినట్టుంటుంది. ప్రాచీన చీనా చిత్రలేఖనం ఒకటి మనముందు విప్పి పరుస్తున్నట్టు ఉంటుంది. ఆ అడవిదారుల్లో కొండలమీంచి సాగిపొయే మేఘాల నీటి ఆవిరి, కెరటాల్లాగా కొండలు, ఎర్రటి తురాయిచెట్లు, దూరంగా లోయల్లో అక్కడా అక్కడా కొండపల్లెలు, ఆ ఇళ్ళ కప్పులమీంచి పైకి లేచే వంటపొగ160
చైనాను చూపించే కథలు
ఒక మామూలు సమాజంలో, చిన్ని చిన్ని ఆశలు, నిరాశలు, త్యాగాలు, మోహాలు, మోసాలతో కూడుకుని ఉండే జీవితమే, ప్రపంచంలో తక్కిన ప్రతి చోటా ఉండే జీవితమే అక్కడ కూడా దర్శనమిస్తుంది. కానీ ఆ సాధారణ సుఖదుఃఖాలకు ఆ ప్రజలు లోను కావడంలో, ఆ దేశానిదే అయిన అద్వితీయ లక్షణమేదో ఉంది. ఆ కథలు దాన్నే పట్టుకున్నాయి, చిత్రించడానికి ప్రయత్నించేయి.
