ఇంకా లోతుగా పరిశీలిస్తే షానామా, మహాభారత ఇతిహాసాలు నిర్మాణసూత్రంలోను, కథాగమనంలోను, తాత్త్వికసందేశంలోను, సాంస్కృతిక జీవధారలోను ఏదో ఒక అనిర్దిష్టము, అతిప్రాచీనము, ఏకీకృతము అయిన సమానలక్షణం ఉందని భావించే అవకాశం ఉంది
వెన్నెలకంటి రాఘవయ్య
మనుషులు సామాజికంగా విముక్తి చెందడానికి సాగించే పోరాటంలో మూడు దశలుంటాయి. మొదటి దశలో మేము కూడా మనుషులమే అని చెప్పుకోడానికీ, గుర్తింపు పొందడానికీ చేసే పోరాటం నడుస్తుంది. ఆ తర్వాతి దశలో తక్కిన మనుషులతో పాటు సామాజికంగా సమానావకాశాలకోసం పోరాటం నడుస్తుంది. మూడవదశలో వాళ్ళు తాము కూడా శ్రేష్ఠమానవులం కాగలమని పోరాడి నిరూపించే దశ ఉంటుంది.
మట్టిగూడు
కాని సత్యశ్రీనివాస్ లాంటి వాళ్ళకి అది దైనందిన సమస్య. అనుక్షణ వేదన. అతడి దృష్టిలో పర్యావరణమూ, మానవహక్కులూ వేరువేరు కావు. సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ ఒకదానికొకటి సంబంధించనవి కావు.
