అలా ఒక్క కవిత నీకెన్ని కవితల్ని గుర్తుకు తెస్తే నువ్వంత సుసంపన్నుడివి. నాకింతదాకా ఇటువంటి సంపన్నులు ముగ్గురు తెలుసు. ఉర్దూపారశీక కవిత్వాల్లో సదాశివగారు, సంస్కృతాంధ్ర కవితాల్లో శరభయ్యగారు, ఇంగ్లీషు, ఫ్రెంచి కవిత్వాల్లో సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. ఇప్పుడు జపనీయ కవిత్వాస్వాదనలో నాసరరెడ్డిని కూడా వారి సరసన చేర్చవచ్చునని తెలుసుకున్నాను.
సాత్త్వికీకరణ వాచకం
ఆమెలో ఉన్న సంస్కారానికి ఆమె పాండిత్యం, ఆమె అధ్యయనం మరింత మెరుగుపెట్టాయి. ఆమె ముందే సాత్త్వికురాలు, సాహిత్యం ఆమెని మరింత సాత్త్వికీకరించింది. ఇక ఆమె ఎవరితో మాట్లాడినా, ఏమి మాట్లాడినా ఆ సాత్త్వికసుగంధం పొంగిపొర్లకుండా ఎలా ఉంటుంది?
నలుగురు పాండవులు
ఈ విచ్ఛిత్తిలో ఒక క్రియాశీలత్వం కూడా వుంది. విగ్రహాల్ని ధ్వంసం చెయ్యడం లాంటి విచ్ఛిన్నం కాదిది. గుడ్డుని విచ్ఛిన్నం చేసుకుని ప్రాణి బయటపడటం లాంటి విచ్ఛిన్నత. ఇది ఏకకాలంలో విధ్వంసకం, సృజనాత్మకం కూడా.
