కవులు రాసిన కథలు

ఏదో ఒక theme ని ఎంచుకుని కథాసంకలనాలు తేవడం తెలుగులో కొత్తకాదు. కాని, ఒక సంకలనం ఇంతగా ఆలోచనలో పడేయడం మాత్రం నాకైతే ఇదే మొదటిసారి. ఈ అంశాలమీదా, ఇటువంటివే తమకి స్ఫురించిన మరిన్ని అంశాలమీదా, కవిత్వ పాఠకులూ, కథాపాఠకులూ కూడా రానున్న రోజుల్లో తమ ఆలోచనలు మరింత వివరంగా పంచుకుంటారని ఎదురుచూస్తున్నాను.

మా సోదరుడు

నిజమైన రచయితకి చెప్పుకోదగ్గ రచనలు చేయడాన్ని మించిన పురస్కారం మరొకటుండదు. అలా చూసినట్లయితే, సమకాలిక రచయితల్లో, రామ్మోహనరావు గారికన్నా పురస్కృతులు మరొకరు లేరు.

చింతల చేను

ఈ నవల నేను పట్టలేనంత భయంతో, ఉత్కంఠతో, ఆదుర్దాతో చదివాను. ఆ ట్రాక్టరుకి ఏమవుతుందో, ఆ కుటుంబానికేమవుతుందో అని. కాని ఇదివట్టి కథ కాదు. వ్యథార్థజీవిత యథార్థదృశ్యం.