అసలు ప్రభుత్వం అక్కడ ఆ పర్యాటక మందిరాలు నిర్మించేబదులు ఆ జనావాసానికొక గృహసముదాయం,ఒక నీటిపారుదల వ్యవస్థ, మరుగుదొడ్లు, పాఠశాల ఇవ్వడం ముఖ్యమనిపించింది.బహుశా, ఇప్పుడు గాంధీజీ ఆ గ్రామాన్ని సందర్శిస్తే అక్కడే ఉండిపోతాడని కూడా అనిపించింది.
నా చంపారన్ యాత్ర-1
అక్కడ రెండు నీలిమందు మొక్కలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు చంపారన్ లో 95,970 ఎకరాలమేరకు విస్తరించిన నీలిమందుతోటలు ఇప్పుడు రెండు నమూనా మొక్కలుగా మిగిలిపోయి, ‘పేదవాళ్ళ ఆగ్రహం’ ఎంత ప్రమాదకరమైందో ఎలుగెత్తి చాటుతున్నాయనిపించింది.
నా కాశీయాత్ర-4
ఆ మాట వినగానే నా మనోబుద్ధ్యాత్మలన్నీ ద్రవీభూతమైపోయాయి. ఈ ప్రపంచంలో ఇప్పుడిట్లాంటి ఆహ్వానం ఎక్కడ లభిస్తుంది? జీవించిఉండిఉంటే, మా అమ్మ నుంచి వినవచ్చే పిలుపు. 'ముందు అన్నం తినండి, తర్వాత మాట్లాడుకుందాం' అనే మాట మా నాన్నగారి మాట. నాకు గుండెలో కన్నీళ్ళు ఉబికాయి.
