తన గురువునుండి పొందిన ఆ ప్రేమని ఇప్పుడాయన తిరిగి మళ్ళా ధారాళంగా వెదజల్లుతున్నారు కాబట్టే వేలాదిమంది శిష్యులు ఆయన సన్నిధి నుంచి స్పూర్తి పొందుతున్నారు. విద్యావంతులైన నాగరికులు తమ శక్తియుక్తులన్నీ మనుషుల్ని మతాల పేరిట విడదీయడానికి చూస్తుంటే, ఇక్కడ, ఈ సూఫీ సంప్రదాయ రామదాసును ఆశ్రయించుకున్న గ్రామీణులు మతాలకు అతీతమైన ఒక ప్రేమసమాజంగా జీవిస్తున్నారు.
గోదావరి మా ఇంటికొచ్చింది
మొదటి ప్రశ్న వెయ్యడం వరకే నేను చేసింది. ఆ తర్వాత ఒకదాని వెనక ఒకటి ఆ సంగతులన్నీ గోదావరి ప్రవాహంలాగా ఆయన్నుంచి పొంగిపోతూనే ఉన్నాయి.
వెంకటరత్నం మాష్టారు
ఆయన మాష్టారి క్లాసు ఆద్యంతం ముగ్ధుడైపోయి విన్నాడు. తాను ఆ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టినందుకు గర్విస్తున్నానని చెప్పాడు. అదొక అపురూపమైన దృశ్యం. నాకు తెలిసి, అంతకు ముందు ఎలానూ జరగలేదు, కనీసం ఈ యాభై ఏళ్ళల్లో మళ్ళా అటువంటి సంఘటన మన పాఠశాలల్లో జరిగినట్టు నేను వినలేదు!
