కాలానికి ఊపిరి పొయ్యాలి

రాబోతున్న ప్రతి రోజూ, ప్రతి మాసం, ప్రతి ఋతువు, ప్రతి ఏడాదీ మనకీ, మన వాళ్ళందరికీ మంచిచెయ్యాలని కోరుకుంటాం. ఒక్క న్యూ యియర్ డే అనేమిటి? ప్రతి ఉదయమూ శుభోదయం కావాలనే మనసారా కోరుకుంటాం.

తలపుల్ని తలపులతోటే శుభ్రం చెయ్యాలి

ఆనందం, ధైర్యం, విశ్వాసం కొరియర్లో ఇంటికి వచ్చేవి కావు. తెల్లవారిలేచి చూస్తే అడుగడుగునా, అనుక్షణం అవి మనమీద ధారాళంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనమింకా నిశ్చింతగా మన హృదయావేదనని అక్షరాల్లో పెట్టగలుగుతున్నాం.

మెరుగైన బేరం

మామూలుగా మనం ఏమనుకుంటామంటే ప్రేమ లెక్కల్నీ, లాభనష్టాల్నీ చూసుకోదని. కాని ప్రేమకి తనదే అయిన ఒక అంకగణితం ఉంది. ప్రేమికులు తమ ప్రేమనీ, ప్రపంచాన్నీ తక్కెడలో వేసి చూసుకున్నాకనే, ప్రేమ ప్రపంచం కన్నా ఎన్నో రెట్లు విలువైందని గ్రహించాకనే ప్రపంచాన్ని పక్కకు నెట్టేస్తారు.