మట్టిమనిషి

ఆ నాటకం చూస్తున్నంతసేపూ, ఆ కథాంశానికి కాలం చెల్లలేదనీ, ఇప్పుడు మన సమాజంలో మట్టిమనిషి వెర్షన్ 2.0 నడుస్తోదనీ నాకు పదే పదే అనిపించింది. ఇప్పుడు సాగుభూమిని సినిమహాలుగా మార్చి పెట్టుబడిని రెండింతలు, మూడింతలు చేసుకోడం మీద కాదు, ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ పాచికగా మార్చి పెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే పదింతలు చేసుకోవాలనే రాక్షసదురాశ ఆవహించిన కాలంలో ఉన్నాం.

న్యూ బాంబే టైలర్స్

ఖదీర్ బాబు 'దర్గామిట్ట కథలు' లో కనవచ్చే ఒక నైతిక పార్శ్వం ఈ నాటకంలో కూడా ఉంది. అదే ఈ నాటకాన్ని విషాదాంతం కాకుండా చేసింది. మనిషి ఒక పనిముట్టుగా, ఒక కూలీనంబరుగా మారిపోకుండా నిలబడాలని చెప్పే ఈ కథ ఈ నాటకాన్ని ఆశావహంగా ముగించింది.

హిందువులూ, ముస్లిములూ కాదు, మనుషుల కథలు

రూపకం నడుస్తున్నంతసేపూ మనం మనలోకి చూపుసారిస్తాం. మనల్ని మనం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం, ఏవో జవాబులు చెప్పుకోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఏ ఒక్క జవాబూ తృప్తి కలిగించదు. మనలో ఈ కలవరం కలిగించడమే నాటక బృందం ఉద్దేశ్యమయితే వారు అనుకున్నది సాధించారనే చెప్పాలి.