ఆ దీపాలు, ఆ కాగడాలు, ఆ ప్రభలు, ఆ పూనకం- అది మీరు వదిలిపెట్టి వచ్చేసిన ఏ పురాతన గ్రామానికో, మీరు మర్చిపోయిన ఏ ఆత్మీయ బాంధవ్యాలకో చెందిన దృశ్యం.
వడ్డాది పాపయ్య
ఆ చిత్రాన్నట్లానే చాలాసేపు తదేకంగా చూస్తూండిపోయాను. ఆ పడుచుని చిత్రిస్తున్నప్పుడు చిత్రకారుడు ఆమె యవ్వనం మీద కన్నా ఆమె ముగ్ధత్వం మీదనే దృష్టిపెట్టాడని తెలుస్తూ ఉండింది.
ప్రేమలోనూ, కళలోనూ
ఒక పట్టణం మహానగరంగా మారిందని ఎప్పుడు చెప్పగలం? ఆ ఊళ్ళో నీటిరంగుల చిత్రలేఖనసామగ్రి దొరికినప్పుడు అని చెప్తాన్నేను.
