సాయంకాలమంతా గడిపాక 'ఇక వెళ్ళొస్తాన' ని తన ఇంటికో, గదిలోకో, తనుండే ఊరికో వెళ్ళినట్టే వెళ్ళిపోయాడతడు, మరేమీ చెప్పకుండా వదిలి ఉంచకపోయినా ఏ సంకేతాలూ.
ఒక ఆదిమ మంత్రజాలం
'లేదు. నేను చూస్తున్నదేదో నాకై నేను బోధపర్చుకోవాలనీ దాన్ని నాదైన పద్ధతిలో చిత్రించాలనీ నా కోరిక. నా డ్రాయింగులు బొమ్మలు కావు. అవి నా వ్యక్తిగత చిత్రాక్షరాలు.' కాఫ్కా మళ్ళా చిరునవ్వాడు.- 'నేనింకా ఈజిప్షియన్ దాస్యంలోనే ఉన్నాను. ఎర్రసముద్రం ఇంకా దాటలేదు
తేజో సముద్రపు కెరటం
అది దేవాలయమా? బౌద్ధ మందిరమా? యూదుల సినగాగా లేక కాజీ నజ్రుల్ ఇస్లాం రాసిన ప్రభాత షహనాయి వాద్య సంగీతమా? ఆ వెలుగు దేవాలయంలోంచి వస్తున్నదా లేక తూర్పుదిక్కుగా వస్తున్నదా? ఇంతకీ ఆ వెలుగు బయటినుంచి వస్తున్నదా లేక అవనత శిరస్కులైన ఆ ధ్యానుల లోపలి వెలుగునా?
