మూడు నదుల దేశం

. నువ్వు మరింత కిందకి దిగి, మరింత దగ్గరగా నీ దేశాన్ని పరికించి చూడగలిగితే, ఇదుగో, ఇట్లాంటి మూడు నదులు కనిపిస్తాయి. ఆ మూడు నదుల పరీవాహక ప్రాంతంలో ఇట్లాంటి కళాకారులు సాక్షాత్కరిస్తారు.

అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?

కాని ఇంత దూరం ప్రయాణించినా యూరపియన్-అమెరికన్ చిత్రకళకి తృప్తి లేదు. చీనాలో ప్రాచీన చిత్రకారులు చిత్రించిన కొండల్నీ, వెదురుపొదల్నీ, పువ్వుల్నీ, సీతాకోక చిలుకల్నీ చూసినప్పుడల్లా ఆధునిక చిత్రకారుడు అశాంతికిలోనవుతూనే ఉన్నాడు. ఎలాగు? అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?

చిత్రకారుడు ఒక అనువాదకుడు

ఏళ్ళ తరబడి రంగుల్తోనూ, గీతల్తోనూ సాధన చేస్తూ వచ్చేక ఇన్నాళ్ళకు నాకు అర్థమయిందేమంటే చిత్రలేఖనం కూడా ఒక కథనం. అక్కడ వాస్తవంగా ఉన్న రంగులకన్నా నువ్వు ఏ రంగులు చేర్చి తిరిగి చెప్తున్నావన్నదే ఆ చిత్రానికి ఆకర్షణ.