
నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మరో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
దేన్ని కేంద్రంగా
నా బాధాభావధోరణులు
స్వయంగా వలపన్నుకొని
ఇరుక్కొంటాయోగాని
ఒఠి ముళ్ళకంపగా
మటుకే కానవస్తున్నానట నేను
తెలియరాని ఆ కేంద్రం
వేళ్ళుదన్నిన నేలస్వభావమేమోగాని
పనికిరాని మొక్కనని
తొలగిపోతున్నారట యీ
లోకపు ప్రజలు
నా లోపలి రసాయనాలు
ప్రపంచానికై మథనపడి
నా కన్నుల్లో వర్షించే సుకుమార కారుణ్యం
ఒక వ్యథానుభవ పుష్పం.
కాని యీ జనులందరికీ
ఒట్టి ముళ్ళతీగెకి పూసిన పువ్వు
పచ్చబడ్డ వాళ్ళ కళ్ళల్లో
వొందలు వేలు బలిరక్కసి పూలు.
21-1-1984
Argemone mexicana
Unsure of the center
Around which
My feelings of pain
Wrap themselves;
I’m perceived as a thorny vine.
These worldly folk cast me aside,
Seeing me as nothing but useless.
Yet the elixirs within me swell for the world;
My eyes rain a subtle warmth
That unfurls a flower,
Rising from the depths of despair.
But to these people, everyone and all,
I’m still a flower on a thorny vine.
Wherever falls their sickly gaze now,
prickly flowers bloom, tens of thousands.
12-11-2025


🙏🌹
వాళ్ల పచ్చబడ్డ కళ్లల్లో వొందలు వేలు బలు రక్కసి పూలు …ప్రకృతిపాఠం.నమస్సులు
ధన్యవాదాలు సార్!
మీ కవితలో మీలోని కవి తన అంతరంగ వేదనను, ఆత్మపరిశీలనను, సమాజపు అపార్థ దృష్టిని ప్రతిబింబించాడు. తన బాధకు మూలం ఏమిటో తెలియక తానే తానుగా వలపన్ని ముళ్లతో కూడిన కంపగా మారిన తన స్థితిని వివరిస్తాడు. సమాజం తన సున్నితత్వాన్ని అర్థం చేసుకోలేక “పనికిరాని మొక్క”గా విస్మరిస్తుంది. కానీ కవిలోని లోతైన రసాయనాలు సృజనాత్మక భావజాలం ప్రపంచం కోసం మథనమవుతాయి. ఆయన కన్నుల్లో కురిసే “సుకుమార కారుణ్యం” వ్యథలోంచి పుట్టిన సౌందర్యంగా మారుతుంది. అయినప్పటికీ, ప్రజలు ఆ పుష్పంలో ముళ్లనే చూస్తారు. కవి తన సృజన, దయ, వేదన సమాజానికి అపార్థమవుతున్న పరిస్థితిని వ్యంగ్యంగా చూపిస్తూ, ఒక ఆత్మసాక్షాత్కార గాథను అల్లాడు.
మీ ఇంగ్లిష్ అనువాదం ఈ భావాన్ని బాగా అందుకుంది — అది మూల కవితలోని వేదన, కారుణ్యం, సున్నితత్వాన్ని సహజమైన, కవితాత్మక భాషలో వ్యక్తపరుస్తుంది. “The elixirs within me swell for the world”, My eyes rain a subtle warmth”,Wherever falls their sickly gaze now, prickly flowers bloom, tens of thousands” వంటి పంక్తులు మూల భావానికి అచ్చమైన ప్రతిధ్వని. మొత్తం మీద, ఈ అనువాదం అర్థానికి నిబద్ధంగా, భావానికి నిండుగా, శైలికి సరళంగా ఉండి కవిత యొక్క ఆత్మను సజీవంగా నిలబెట్టింది.
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ గారూ!