
నిర్వికల్ప సంగీతం (1986) నుంచి ఇంకో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
వెళ్ళిపోతున్న వరదల్ని వెనక్కి లాగాలని. ..
వెళ్ళిపోతున్న వరదల్ని వెనక్కి లాగాలని
ఎందులో ఇంకా యీ వెర్రికోర్కె నాకు
వరదలు ప్రవహించిపోయిన
జేగురురంగు పంటపొలాల్లో
సాయంసంధ్య వుసురుమని కూలబడే వేళ
మలినపక్షాల కొంగలు మిడతల్ని వేటాడే చోట
పొర్లిపోయిన బీభత్సపు బాధాపరిష్వంగ సుఖాన్ని
పదేపదే స్మరించుకొంటో
దాటిపోతున్న వరదల్ని వెనక్కి లాగాలని
ఎందుకో ఇంకా ఈ పాడుకోర్కె నాకు.
నిర్మల శరదాకాశం కింద
రెల్లుబయళ్ళని మెత్తగా తాకుతో
సెలయేళ్ళు ప్రవహించాలని కలలుగన్న నాపై
వరదలు వరదలు వరదలు
అప్పటికీ
నిలవనీయకుండా కుదిపే యీ మురికి వరదల్ని
వెనక్కి లాగాలని కావిలించుకోవాలని
ఎందుకో యింకా అర్ధం లేకుండా నాకు!
2-11-1983
Why This Longing
To pull back the floods sweeping away—
Why do I still harbor this foolish desire?
In the fields turned rusty brown
where the floods have swept through
when the evening twilight swoons
beside the mud-brown herons pecking-
Remembering again and again
the pleasure of embracing pain—
that terrible overflow
that swept away everything—
floods, floods, floods-
On me who dreamt
gentle streams would flow
softly caressing the wild cane groves
beneath the October sky
Yet, why this longing
I can’t understand—
to pull back these filthy floods
that ravage me.
Featured image: Image generated with chatlyai.app
5-11-2025


మానవ మనస్తత్త్వానికి ప్రతీకగా నిలిచే కవిత. ప్రశాంత నిర్మల శరద్వహప్రాకృతిక సౌందర్యం
కన్నా జీవన్నిర్మాల్యపువరదలవైపే మనసు లాగటమనే అరిషడ్వర్గ చాపల్యాన్ని తలపింప జేసే అపురూప కవిత. మూలం లోని భావం అనువాదంలో స్పష్టత పొందింది . పొరపడితే సరిదిద్దవచ్చు . అభినందనలు.
ఎంతో ఆదరంగా రాసిన మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ ఆలోచన నాది కూడా…దీన్ని మీరు అభివ్యక్తీకరించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది.
మీ అనువాదం, ఆ కవిత మీరు ఇంగ్లీషు భాష లో పెట్టిన పేరు చక్కగా సరిపోయింది. నిర్వికల్ప సంగీతం మీ మొదటి కవితా సంపుటి అయినప్పటికీ ఆ కవితలలో చాలా పరిణితి కనిపిస్తుంది.
నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు…ఈ కవితల్ని ఇలా మళ్ళీ మా అందరితో పంచుకుంటున్నందుకు..
హృదయపూర్వక ధన్యవాదాలు స్వాతీ!