తెలుగదేల యన్న

తమిళనాడులో నాయనార్లూ, ఆళ్వార్లూ కవిత్వం చెప్పిన తావుల్లో ఆరేళ్ళ కిందట సంచరించి వచ్చాక ఆ అనుభవాల్ని ‘పాటలు పుట్టిన తావులు’ (2020) గా వెలువరించాను. ఆ స్ఫూర్తితో తెలుగునాట పద్యాలు పుట్టిన తావుల్ని కూడా సందర్శిస్తూ ఆ అనుభవాల్ని ఎప్పటికప్పుడు నా బ్లాగుద్వారా పంచుకుంటూ వచ్చాను. అలా ఇప్పటిదాకా రాసినవి 52 వ్యాసాలు. వాటితో పాటు తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి గురించీ, భవిష్యత్తు గురించీ రాసినవి మరో నాలుగు వ్యాసాలు.

ఆ యాభై ఆరు వ్యాసాల్నీ (అవును, యాభై ఆరు! అనుకోకుండా అలా కలిసొచ్చింది!) ఇప్పుడిలా ‘తెలుగదేలయన్న’ అని పుస్తకరూపంలో వెలువరిస్తున్నాను. 320 పేజీల ఈ పుస్తకం డిజిటలు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.


పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలెంలో నెలకొన్న ఆంధ్రీకుటీరం 19-20 శతాబ్దాల్లో ఆధునిక తెలుగు సాహిత్యవికాసానికి నిరుపమానమైన కృషి చేసింది. తిరుపతివెంకట కవుల వంటివారే ఆ కుటీరాన్ని తమ సాహిత్యయాత్రకు ఒక సాక్షిగా పేర్కొన్నారు. ఆ కుటీరంతో పాటు ‘ఆంధ్రి’ అనే పత్రిక నడిపిన మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారూ, వారి సోదరులు సూరయ్యశాస్త్రిగారూ నాపట్ల అవ్యాజమైన వాత్సల్యాన్ని కనపరిచారు. ఇప్పుడు ఆ పరంపరలో భాగంగా మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, వారి సోదరుడు చలపతి కూడా అక్కడ ‘రత్నప్రభ గ్రంథాలయం’ నిర్వహిస్తున్నారు. ఆ కుటుంబం నా పట్ల చూపించిన ఆదరానికి కృతజ్ఞతగా ఈ పుస్తకాన్ని ఆంధ్రీకుటీరం చరణాలముందు సమర్పిస్తున్నాను.

ఇది నా 73 వ పుస్తకం.

4-11-2025

5 Replies to “తెలుగదేల యన్న”

  1. మీ పాటలు పుట్టిన తావులు చదివాక, మన తెలుగు నాడు మీద కూడా ఇలాంటి పుస్తకం ఒకటి వస్తే బాగుండు అనుకున్నాను సార్..
    ఇప్పుడు ఈ పుస్తకం చూసాక చాలా ఆనందం కలిగింది.
    ధన్యవాదాలు.

    1. Sir నమస్తే, డిజిటల్ లైబ్రరీ ల అడ్రెస్స్ ల గురించి కూడా ఏమైనా రాయండి

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading