దివ్య ప్రేమగీతం

బైబిల్లో పాతనిబంధనలో మూడవ భాగంలోని పరమోన్నత గీతం ఎనిమిది సర్గల 117 చరణాల చిన్న గీతం. సొలోమోను రాసాడని చెప్పే ఈ గీతం రెండువేల ఏళ్ళుగా యూదీయ, క్రైస్తవ ఆధ్యాత్మికత మీద నెరపిన ప్రభావం అపారం. మరీ ముఖ్యంగా గత వెయ్యేళ్ళుగా ఐరోపీయ సాహిత్యానికీ, సంగీతానికీ, తాత్త్వికతకీ ఆ గీతం అందిస్తున్న స్ఫూర్తి కూడా సామాన్యమైంది కాదు. గత శతాబ్దం నుంచీ ఆ గీతాన్ని కళాత్మకత దృష్ట్యా, కవిత్వశిల్పం దృష్ట్యా, పర్యావరణకోణం దృష్ట్యా సరికొత్తగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏ విధంగా చూసినా ప్రపంచ సాహిత్యంలోని శ్రేష్ఠకృతుల్లో అగ్రశ్రేణిలో నిలబడే ఈ గీతాన్ని రెండేళ్ళ కిందట తెలుగులోకి అనువదించాను. ఇప్పుడు ఆ గీతానికి సర్గల వారీగా వివరణలతో పాటు, ఇప్పటిదాకా వచ్చిన వ్యాఖ్యానాల్ని దృష్టిలో పెట్టుకుని ఒక విపులమైన ముందుమాట కూడా రాసి ‘దివ్యప్రేమ గీతం’ పేరిట ఇలా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకం డిజిటలు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌన్లోడు చేసుకోవచ్చు.

ఈ నిర్మల గీతాన్ని ఆత్మీయురాలు నిర్మలకి శుభాకాంక్షల్తో అందిస్తున్నాను.

ఇది నా 70 వ పుస్తకం.

20-9-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading