
గత అయిదారేళ్ళుగా సాహిత్యం గురించి రాస్తూ వచ్చిన వ్యాసాల్ని ప్రక్రియాపరంగా విడదీసి, కవిత్వం గురించి రాసినవాటిని, తీరనిదాహం పేరుతోనూ, కథల గురించీ, నవలల గురించీ రాసిన వాటిని, కథల సముద్రం పేరుతోనూ ఈ-బుక్కులు మీతో పంచుకున్నాను. మిగిలిన వ్యాసాల్లో సాహిత్యానుభూతి, సాహిత్యప్రయాణాలు, సాహిత్యబాంధవ్యాల గురించిన కొన్ని వ్యాసాల్ని ఆ బంభరనాదం పేరిట ఇలా పంచుకుంటున్నాను.
దీన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రులతో పంచుకోవచ్చు.
నేను రాజమండ్రిలో ఉన్నరోజుల్లో యెర్రాప్రగడ రామకృష్ణ ఇల్లు మాక్కూడా ఇల్లుగానే ఉండేది. ఆయన శ్రీమతి మాకందరికీ సోదరి. ఆమె పెట్టిన అన్నంతోనే రాజమండ్రిలో నా సగం రోజులు గడిచాయి. కాబట్టి ఈ రాఖీపున్నమి రోజు ఈ పుస్తకాన్ని ఆమెకీ, రామకృష్ణకీ కానుక చేస్తున్నాను.
ఇది నా 67 వ పుస్తకం.
7-8-2025


చాలా సంతోషం భద్రుడు గారు.. ఈ ఈ-పుస్తక రూపంలో అపురూపమైన, సాహిత్యపరమైన మీ గత ఐదేళ్ల వ్యాసాలన్నింటినీ ఒకే చోట లభించేలా చేసినందుకు ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
బoబర నాదాలు.. 38 నాదాలు.. చదివినప్పుడు ఆ 38 నాదాలు 38 ఏడాదులుగా మనసంతా నిండిపోయి అనాహత నాదాలుగా మిగిలే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ నాదాలను ఒడిసి పట్టి పుస్తకరూపంలో అందిస్తే .. మరింత కంటే మధురం ఏముంటుంది.. thank you sir 🙏🌹
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
thank you sir