
తుకారాముడిలాగా
నేను కూడా నా దుకాణం
మొత్తం పరిచిపెట్టాను.
నాతో పాటు
కానుగచెట్టు కూడా.
ఎవరికి కావలసింది
వారు తీసుకోవచ్చు.
మేమిద్దరం పుణికిపుచ్చుకున్న
ఫాల్గుణ మాసం
మా దోసిలిమీంచి
వీథిలోకి పొంగిపొర్లుతోంది.
ఈ ఆకుపచ్చని షామియానా కిందకి
ఎవరు వచ్చి నిలబడ్డా
వారి ఔదార్యానికి
ఆశ్చర్యపోతుంటాను.
నమ్మకమైన కొనుగోలుదారుడికోసం
ఓపిగ్గా ఎదురుచూడవలసి ఉంటుందని
మాకు తెలుసు.
అతడికి మాత్రమే తెలుస్తుంది
ఇక్కడ ఏ ఒక్కటి తీసుకున్నా
మొత్తం దుకాణమే తనవెంట
వచ్చేస్తుందని.
1-3-2025


Very nice 🌳💚🌳
Thank you.
కానుగ మాకు కులదేవత. తుకారాం దుకాణం కానుగ దివాణం ఫాల్గుణ మాసం వెరసి అద్భుతమైన ఆధ్యాత్మిక అంతరాత్మిక సామాజిక పద్యం. అనవద్యం.
ధన్యవాదాలు సార్! కానుగ చెట్టు అనుగ్రహించిందన్నమాట!
అవును సర్ . కులదేవత కావడం వల్లనేమో తెలియని మోహం.
మాకు మాత్రమే తెలుసు..
నా కుటీరం Subscribe చేస్తే
మొత్తం ప్రపంచం అంతా మా వెంటే వస్తుందని😊🙏