రెండుమూడు రోజుల కిందట కృష్ణకుమారిగారి వాల్ మీద చూసాను. ఆమె పుస్తకాల స్టాలు దగ్గరకు వచ్చిన ఒక సందర్శకుడు ఈ పుస్తకం పేజీలు కొన్ని తిరగేసి తన మిత్రుడితో 'ఇది వ్యక్తిత్వ వికాస గ్రంథంలాగా ఉంది' అని అన్నాడట. ఆ మాటలో చాలా నిజముంది. వ్యక్తిత్వ వికాస గ్రంథం అనే కన్నా, జయగాథల సంపుటం అనడం మరింత సముచితంగా ఉంటుంది.
