తెలుగదేల యన్న

ఆ యాభై ఆరు వ్యాసాల్నీ (అవును, యాభై ఆరు! అనుకోకుండా అలా కలిసొచ్చింది!) ఇప్పుడిలా 'తెలుగదేలయన్న' అని పుస్తకరూపంలో వెలువరిస్తున్నాను. 320 పేజీల ఈ పుస్తకం డిజిటలు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.

వేములవాడ-కుర్క్యాల

ఆ విధంగా దక్షిణభారతసాహిత్యానికి వేములవాడ ఇచ్చిన ఉపాదానం అద్వితీయమైంది. ప్రపంచ సాహిత్యచరిత్రల్లోనే ఇటువంటి గణనీయమైన పరివర్తనకు కారణమైన నగరాల్ని వేళ్ళమీద మాత్రమే లెక్కించగలుగుతాం.

గోరింట పూసింది కొమ్మ లేకుండా

నిన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి పుట్టినరోజు. 'కృష్ణపక్షం'లోని కవిత్వం సరే, సినిమా పాటల పేరు మీద కూడా ఆయన ధారాళంగా నిర్మలకవిత్వాన్ని దోసిళ్ళతో వెదజల్లాడు. కృష్ణశాస్త్రి ఫిల్ము గీతాల్లో కవిత్వం గురించి 2007 లో చేసిన ప్రసంగం ఈ రోజు మళ్ళా మీతో పంచుకుంటున్నాను.