
ఈ ఏడాదిగా నేను విడుదల చేస్తూ ఉన్న డిజిటలు పుస్తకాలు ప్రింటెడు పుస్తకాలుగా రావా అని కొందరు అడుగుతూ ఉన్నారు. అటువంటి మిత్రులు కొందరు తనని కూడా ప్రింటెడు పుస్తకాలకోసం అడుగుతున్నారనీ, నాలుగు పుస్తకాలు ప్రింటు చేస్తామనీ పల్లవి పబ్లిక్సేషన్సు వెంకట నారాయణగారు అడిగారు. పుస్తకాలు ప్రింటు చేయడం పట్ల నాకు సుముఖత లేకపోయినప్పటికీ, ఆయన ఒక్కో పుస్తకం వంద కాపీలు మాత్రమే వేస్తామనీ అనడంతో సరేనన్నాను. (పదకొండు కోట్ల మంది తెలుగువాళ్ళల్లో ఆ వంద పుస్తకాలూ కూడా కొనేవారుండరేమో, వెంకటనారాయణగారికి నష్టమొస్తుందేమో, అని అనుమానిస్తూనే.)
పుస్తకాలు ముద్రిస్తామని చెప్పి వారం తిరక్కుండానే ఈ రోజు నాలుగు పుస్తకాలూ రెండేసి కాపీల చొప్పున నా ఇంటికి చేరాయి. చాలా అందంగా ముద్రించారు. ధర కూడా మరీ ఎక్కువ పెట్టారనిపించలేదు. ఆసక్తి ఉన్న మిత్రులు వెంకటనారాయణగారిని (98661 15655) సంప్రదించవచ్చు.
ఉదారచరితులు, 184+4 పేజీలు, రు.250
కథలు ఎలా పుట్టాయి 188+4 పేజీలు, రు.225
ఆ బంభరనాదం, 176+4 పేజీలు, రు.200
ప్రేమగోష్ఠి, 108+4 పేజీలు, రు.150
మొత్తం నాలుగు పుస్తకాలూ రు. 825
22-10-2025


చాలా సంతోషంగా ఉంది భద్రుడు గారు మీ ఈ పుస్తకాలు ప్రచురణకు నోచుకోవడం. ఏదో పుస్తకాల గ్రూప్ లో ఈ విషయం చూసి నేను వారం రోజుల క్రితమే ఆర్డర్ పెట్టాను. ఇంక ఇండియా లో డెలివరీ అయ్యాకా అమెరికాకి ఎలా తెప్పించుకోవాలో ప్లాన్ చెయ్యాలి. మరిన్ని పుస్తకాలు, ముఖ్యంగా వెన్నెల రాత్రుల్లో ఎప్పుడు ప్రచురించ బడుతుందా అని ఎదురు చూస్తున్నాను.
చాలా సంతోషం సార్!
ఎంతో సంతోషం. 100 కాపీలేంటి… ఎన్నైనా సరిపడేంత వరకు వెయ్యాలి. ప్రతి ఒక్కరూ కొనుక్కుని ఇంట్లో భద్రంగా అట్టేపెట్టుకోవాల్సి న అక్షరాలవి. నమోనమః.
ధన్యవాదాలు మేడం
శుభోదయం సార్. ఇప్పుడే వెంకట నారాయణ గారితో మాట్లాడాను. కొన్ని కాపీలు పంపమని request చేసాను. Xerox కంటే ధర తక్కువ గానే ఉంది. కొని చదివే వారు తక్కువే నిజమే, కానీ మా లైబ్రరీ సైన్స్ లో చదువు కున్నట్లు Every book and it’s reader’, ‘Every reader and his book’ .. మీ జ్ఞాన సంపద అవసరం మాకు. దయచేసి ఆ వెలుగుల కోసమే ప్రింట్ అవుతే చాలా కాపీలు నాకు అవసరం సార్.
చాలా సంతోషం సార్!