
కిందటేడాది సెప్టెంబరునుంచి మొదలుపెట్టి ఈ సెప్టెంబరుదాకా ఏడాది కాలంలో మొత్తం 26 పుస్తకాలు (మొత్తం 4,738 పుటలు) వెలువరించాను. వాటిని ఎప్పటికప్పుడు డిజిటలు ప్రతుల రూపంలో మీతో పంచుకుంటూ వచ్చాను. వాటిల్లో ‘మూడువందల వచనాలు’ శ్రీపాద ప్రచురణవారు, ‘ఆత్మోత్సవ గీతం’ అనల్ప వారు, ‘కథలసముద్రం’ పుస్తకాన్ని ఎన్నెలపిట్టవారు ప్రచురించారు. ఇందులో బసవన్న వచనాలు తప్ప తక్కిన రెండు పుస్తకాలూ ఆయా ప్రచురణకర్తల దగ్గర లభ్యంగా ఉన్నాయి.
ఈ ఏడాది పొడుగునా ఈ పుస్తకాలను స్వాగతించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.ముఖ్యంగా వీటిని ఎప్పటికప్పుడు ప్రింటు తీయించుకుంటూ చదువుతూ, తమ స్పందనను నాతో పంచుకుంటూ వస్తున్న సోమశేఖర రావుకీ, గౌరునాయుడికీ ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ పుస్తకాలు మొత్తంగాని లేదా ఇందులో ఏవేనా పుస్తకాలు గానీ మీరు చూడకపోయి ఉంటే, వాటినిక్కడ డౌన్లోడు చేసుకోవడం కోసం మళ్ళా లింకులు ఇక్కడ అందిస్తున్నాను. ఆ పుస్తకాలవివరాలు, ఆ లింకులు ఈ కింద చూడగలరు.
కవిత్వం
1.కోమలనిషాదం
నవల
2. ఆ వెన్నెల రాత్రులు
సాహిత్యప్రశంస
3. తీరనిదాహం
4. కథల సముద్రం (ఎన్నెలపిట్ట ప్రచురణగా మార్కెట్లో అందుబాటులో ఉంది.)
5. ఆ బంభర నాదం
విద్య
6. ఆ వెలుగులకోసమే, పాఠశాలలూ, ప్రయోగాలూ, ప్రయత్నాలూ
యాత్రాకథనాలు
7. మునిగితేలాం, బ్రహ్మపుత్రనుంచి కావేరిదాకా
చిత్రకళాప్రశంస
8. తూలిక
నాట్యం, నాటకం, సంగీతం
9. రసధార
సినిమా
10. ఇన్విక్టస్, మరికొన్ని సినిమాలు
తాత్త్విక చింతన
11. సంతోషం ఒక క్రియాపదం
చరిత్ర, సమాజం, సంస్కృతి
12. ఉదారచరితులు
డైరీలు
13. రాజమండ్రి డైరీ, 1986
ఉత్తరాలు
14. పోస్టు చేసిన ఉత్తరాలు
మ్యూజింగ్సు
15. ఇంకొంచెం సూర్యకాంతి
ప్రపంచ సాహిత్య పరిచయం
16. మూడువందల వచనాలు, బసవన్న, అనువాదం, విపుల పరిచయం
17. ఈశ్వర స్తుతిగీతాలు, దావీదు, పాతనిబంధనలోని 60 కీర్తనల అనువాదం, విపుల పరిచయం
18. దివ్యప్రేమగీతం, సొలోమోను, సాంగ్ ఆఫ్ సాంగ్స్ కు అనువాదం, పరిచయం
19. వికసించిన విద్యుత్తేజం, ఆఫ్రికను-అమెరికను సాహిత్యం, అనువాదాలు, విపులపరిచయం
20. ఏకాంత కుటీరం, ప్రాచీన చీనా కవిత్వం, అనువాదాలు, విపుల పరిచయం
21. ఆత్మోత్సవ గీతం, వాల్ట్ విట్మన్ సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ కు అనువాదం(అనల్పబుక్స్ ప్రచురణగా మార్కెట్లో అందుబాటులో ఉంది.)
22. ఆషాఢమేఘం, ప్రాచీన సంస్కృత, ప్రాకృత, తమిళ కవిత్వాల్లో తొలివానాకాలం
23. మనసున మనసై, వాగ్దేవి నుంచి వనలతాసేన్ దాకా, ఎంపిక చేసిన కవితలు, అనువాదాలు, పరిచయం
24. కథలు ఎలా పుట్టాయి, ప్రాచీన కథారూపాల పరిచయం
ప్రపంచ తత్త్వశాస్త్ర పరిచయం
25. ప్రేమగోష్ఠి, ప్లేటో, సింపోజియంకు అనువాదం, విపుల పరిచయం
26. అవధూత గీత, దత్తాత్రేయులు, అనువాదం, విపుల పరిచయం
Featured image and top image: Pallavi and Kundana, The Granddaughters of Sri Gourunaidu releasing the e-books.
20-9-2025


Sir , great literary works of our times. Thanks for providing email links for downloading. Thanks sir
ధన్యవాదాలు సార్
అమూల్యమైన లైబ్రరీ మాకందిస్తున్న మీకు వేన వేన ధన్యవాదములు సార్ 🙏❤️🌹
ధన్యవాదాలు సార్!
వివిధ సాహితీ ప్రక్రియల సమాహారాన్ని మీ అనుభవాన్ని, చింతనను రంగరించి మాకు జ్ఞాన నిధిని అందిస్తున్నారు. నేను చాలా వరకు xerox తీసి చదువుకొని, మిత్రులకు అందించాను. ఈ లింకులలో కొన్ని లభ్యమైనవి. మీకు సదా రుణపడి ఉంటాను. మీకు అనేక కృతజ్ఞతలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
నడిచే గ్రంథాలయం లాంటి మీ నుంచి మీ సొంత గ్రంథాలయం లో కొన్ని పేజీలు, కాదు కొన్ని పుస్తకాలు, మా కోసం పంచి ఇస్తూ, మా ఇంట్లో ఒక పుస్తకాలయం ఏర్పాటు కూడా మీరే చేస్తున్నారు. మేము ధన్యులము మరియు ఎంతో
అదృష్టవంతులం.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్
ఇలా.. ఎలా సార్ .. సహస్రనామాలు, నైవేద్యాలు, అభిషేకాలు ఏవి ఆశించకుండా వరాలు ఇస్తున్నారు 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!