
సమ్మెట ఉమాదేవి ఆదర్శ ఉపాధ్యాయులు. జీవితమంతా బడిపిల్లల్తో గడిపారు. ముఖ్యంగా మారుమూల గిరిజన తండాల్లో బాలబాలికలకి ఒక పూలతోవ చూపిస్తూ గడిపారు. ఆమె తన అనుభవాల్ని పుస్తకాలుగా కూడా తీసుకొచ్చారు. ఆమె గత కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ లో తన వాల్ మీద ‘నూరు కథల వరహాలు’ పేరిట తెలుగులో వచ్చిన కథల్లో తనకు నచ్చిన కథల్ని ఎంచుకుని తన గొంతులో మిత్రులకు వినిపిస్తూ ఉన్నారు. అందులో నూరవకథగా నా ‘శరణార్థి’ కథను వినిపించారు. అందుకు ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు.
‘శరణార్థి’ నా రెండవ కథ. 1980 లో నేనూ, మా అక్కా combined study చేసినట్లుగా కథలు రాయడం మొదలుపెట్టాం. అలా రాసిందే ఈ కథ. దీన్ని అప్పట్లో యువ మాసపత్రిక వారు అచ్చు వేసారు. తిరిగి రాజమండ్రి సాహితీవేదిక వారు 1982 లో ‘కథాగౌతమి’ అనే సంకలనం వెలువరించినప్పుడు ఈ కథ కూడా అందులో చేర్చారు. అలా ఈ కథ మా మాష్టారు శరభయ్యగారి దృష్టికి, పెద్దలు ఆర్.ఎస్.సుదర్శనం, ఆర్.వసుంధరాదేవిగార్ల దృష్టికి వెళ్ళింది.
ఇన్నాళ్ళకు ఉమాదేవిగారి వల్ల ఈ కథ మళ్ళా ఇలా మిత్రులతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కథ ఇక్కడ వినొచ్చు.
10-9-2025

