
ప్రాచీన సంస్కృత, తమిళ, ప్రాకృత కవిత్వాల్లో తొలివానాకాలం గురించిన వర్ణనల్ని వివరిస్తూ ‘ఆషాఢమేఘం’ పేరిట 2008 లో ‘చినుకు’ పత్రికలో నాలుగైదు వ్యాసాలు రాసాను. అంతకుమించి ముందుకు సాగలేదు. కాని రెండేళ్ళ కిందట ఆ ప్రాజెక్టు పూర్తిచెయ్యగలిగాను. ఆ వ్యాసాల్ని నిశితంగా పరిశీలించమని ఉరుపుటూరి శ్రీనివాస్ గారిని అడిగాను. ఆయన ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆదరంగా అక్షరం అక్షరం చదివి ఎన్నో సూచనలు చేసారు. వాటి ప్రకారం నా వ్యాసాల్ని సవరించి చాలారోజులయ్యిందిగాని, ఇదుగో, ఋతుపవనాల ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయేను. ఇన్నాళ్ళకి ఈ మృగశిర కార్తె మొదటిరోజున ఈ పుస్తకాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. దీన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రులకు మాన్సూను గిఫ్టుగా పంపించుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని నా చిరకాల మిత్రుడు, పాటలమాంత్రికుడు గంటేడ గౌరునాయుడుకి కానుక చేస్తున్నాను.
ఇది నా 64 వ పుస్తకం.
6-6-2025


సర్ నమస్తే. అభినందనలు. మీ 64వ సృజనకు స్వాగతం
శుభోదయం. హృదయపూర్వక నమస్కారాలు. మొదటి పాఠకుడిగా ఈ పుస్తకాన్ని స్వాగతించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అభినందనలు సార్. డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఆదివారం రోజున మంచి పుస్తకం చదివాను అనే అనుభూతి కలుగుతుందని తలుస్తాను. మీ రచనా శైలి చాలా బాగుంటుంది. యూట్యూబ్ లో మేఘసందేశం కావ్య పరిచయం చాలా బాగుంది.
కన్నడ మహాకవి కు.వెం.పు రాసిన ఆ తొలి వర్ష వర్ణన మీకు నచ్చుతుంది అనుకుంటున్నా
https://youtube.com/shorts/0eZ2qNrjP4o?si=_ekfK_GOF8XhTGsE
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
Started with the intro essay today, sir! Your tribute to your master garu and stage setting for your upcoming essays is beautifully done. Looking forward to reading more.
Thank you so much!
ఆషాఢ మేఘం భారత సాహిత్యంలో ఎక్కడ కనబడినా, ఆ ఆనవాళ్లను గుర్తుపట్టి, శ్రద్ధగా ఏరి దండ కూర్చి ఈ పుస్తకరూపంలో అందించారు. 🙏🏽
Still reading it, just read the beauty in Tamil Sangam poetry. Thank you for introducing Tamil poetry.
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!