
మొన్న అజంతా మీద ప్రసంగిస్తూ ఆయన స్వప్నలిపిలో చేరని కొన్ని కవితలున్నాయని చెప్పాను కదా. ఆసక్తి ఉన్నవారి కోసం ఆ కవితల్ని ఇక్కడ అందిస్తున్నాను.
1. స్వప్నలిపిలో చేర్చకుండా అజంతానే వదిలిపెట్టిన కవితలు (11): ఇవి డా.సుమనశ్రీ రాసిన ‘అజంతా లిపి’ పుస్తకం నుంచి తీసుకున్నాం. కీర్తిశేషులు సుమనశ్రీగారికి అనేక ధన్యవాదాలు.
2. స్వప్నలిపి తర్వాత అజంతా రాసి, పుస్తకంలో చేరనవి రెండు కవితలు. ఈ రెండూ అనిల్ బత్తుల, ఎం.ఎస్.నాయుడు నాకు అందచేసారు. వారికి అనేక ధన్యవాదాలు.
అ. శతాబ్దం నెత్తురు ఒక పువ్వు (1994)

ఆ. మృత్యువు హాస్యప్రియత్వం (1997)
3. మృత్యువు హాస్యప్రియత్వం కవిత అజంతా చేతిరాతలో. ఈ అపురూపమైన సంపదను నాకు అందించినవారు కల్లూరి భాస్కరం గారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
2-6-2025

