సాయంకాలానికల్లా

సాయంకాలానికల్లా మేనెల
వీథుల్లోకి చేరుకుంటుంది.

చైత్రమాసపు చివరి పరిమళాలుకూడా
చెరిగిపోయిన వీథులు.

అప్పటికే కాలనీలో ఇళ్ళకీ ఇళ్ళకీ మధ్య
సగం జాగా కార్లే ఆక్రమించి ఉంటాయి.

మిగిలిన కొద్దిపాటి జాగాలోనూ
పిల్లలు క్రికెట్టు మొదలుపెడతారు.

ఒక బౌలింగుకీ మరొక బాటింగుకీ
మధ్య విరామంలో నా సాయంకాలం నడక.

మా మధ్యనుంచే ఒక ఎల్ బోర్డు కారు
దారి వెతుక్కుంటూ ఉంటుంది.

సాయంకాలం కాగానే ఆ దుమ్ములోనే
ఏదో ఒకటి వెతుక్కుంటూ ప్రతి ఒక్కరూ.

కొండలూ, అడవులూ కూడా ఖాళీచేసిన
హృదయంతో నేనేమి వెతుక్కోవాలి?

అయినా నడుస్తుంటానా, ఇంతలో
ఎక్కణ్ణుంచో వినిపిస్తుంది కోకిల కూత

తలెత్తి చూడబోతే నేనున్నచోటే
పెద్ద పార్కు కిందకి దిగుతుంది.

3-5-2025

11 Replies to “సాయంకాలానికల్లా”

  1. The imagery of colony lanes filled with cars and people, children playing cricket, and that dusty summer evening is so relatable, sir. Could just see it.
    Beautiful moment of కోకిల పాట lifting the spirit captured in this lovely poem.
    Could just feel it. 🙏🏽

  2. Just Superb.. నేనున్న చోటే పార్కు కిందకి దిగుతుంది.. ఎంత అద్భుతమైన expression.. Thank You భద్రుడు గారు.

  3. ఈ ప్రపంచమంతా పచ్చదనంతో నిండిపోవాలి
    ఎటు చూసినా పూల పరిమళాలు వెదజల్లాలి
    పక్షుల కిలకిల రావాలతోనే తెల్లవారాలి
    ఏ బ్రతుకు భయమూ లేని రోజులు రావాలి
    అంతే పెద్ద కోరికలేముంటాయి మానవాళికి…

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading