బైరాగికి ఒక వాయిస్ మెయిల్

సమంత తమ్మా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు. ఆనంద్ లో రూరల్ డెవలప్ మెంటులో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు . పదిహేనేళ్ళ కిందట మేము కలిసి పనిచేశాం. నేను బైరాగి మీద ప్రసంగాలు మొదలుపెట్టాక, ఒకటి రెండు ప్రసంగాలయ్యాక, ఆమె నాకు ఫోన్ చేసారు. ‘సార్ మీ Bairagi Movement నేను కూడా ఫాలో అవుతున్నాను’ అని అన్నారు. బైరాగి మూవ్ మెంటు! ఆ మాట భలేగా అనిపించింది నాకు.

ఇవాళ ఆమె నాకొక వాట్సపు మెసేజి పంపించారు. అది బైరాగికి ఆమె పంపిన వాయిస్ మెయిల్! నలభై నిమిషాల ఉత్తరం. ఆద్యంతం విన్నాను.

నాకు ఏ విధంగా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు.

ఎంత ఆశ్చర్యం! మొన్న ఒక సోమశేఖర్. నిన్న స్వాతి ఫోన్ చేసి చెప్తున్నారు. ఆమె మొన్న ఆదివారం మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తూ ఉండగా, ఆ నిద్రలోనే బైరాగి కవిత వినబడుతూ ఉందట. ఈ రోజు ఈమె-

బైరాగి నేను ఊహించని హృదయాల్ని తట్టిలేపుతున్నాడు.

కాని ఆశ్చర్యమేముంది? – వాళ్ళకి ఏ సిద్ధాంతాల బరువూ లేదు. ఎటువంటి ముందస్తు అభిప్రాయాలూ లేవు. బైరాగిని తమ హృదయాలకు హత్తుకోడానికి వాళ్ళకి ఏదీ అడ్డం రావట్లేదు. చివరికి భాష కూడా.

కింద ప్లే బటన్ నొక్కి ఆ మెయిల్ వినండి. మనం వింటూ ఉంటే బైరాగి మన ఎదురుగా కూచుని తాను కూడా వింటూంటాడు.

4-3-2025

16 Replies to “బైరాగికి ఒక వాయిస్ మెయిల్”

  1. ఆహా బైరాగి కి శబ్ద లేఖ.. ఎంత బాగుందో.. మీకిచ్చిన వాయిస్ మెసేజ్ ని ఎంతో చక్కని పరిచయ వాక్యాలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.. సమంత గారు.. ఎంత బ్యూటిఫుల్ గా వ్యక్తపరిచారు బైరాగి జీవిత రేఖలు , కవిత్వ ధోరణి గురించి. బైరాగి లైఫ్ & డెత్ గురించి స్పందించిన తీరుని తన కవితలలో ఎలా పొందుపరిచారన్న విషయాల్ని ఆయన కవితలు చదువుతూ విశ్లేషించిన విధానం సూపర్. మీకు చాలా థాంక్స్.

  2. ఎంతో బావుందండీ బైరాగి గారి కవిత్వం చదువుకుని మీ భావాలని ఆయనకే voice note లా పంపడం.
    I saw myself in your words.
    Sir, thank you for sharing this.
    Way behind on catching up on several posts that interest me. Nothing but gratitude for what you give.
    🙏🏽🙏🏽🙏🏽

  3. బైరాగి గారికి స్వరసందేశం ఆసాంతం విన్నాను.ఒక అనిర్వచనీయమైన నవీనానందానుభూతిని కలిగించారు సమంత గారు.. అత్యంత సహజ స్పందన. పుస్తకం పుటలు తిరగేస్తూ కవితలు తనలో తాను పఠిస్తూ పరమపదించిన కవికి వినిపిస్తూ మధ్య మధ్యలో విశ్లేషిస్తూ కొనసాగిన
    ఈ పాఠకురాలి తన్మయకావ్యానందం ఒక కొత్త ప్రయోగం. ఇలా స్పందించాలనిపించడమే సాహిత్య చరిత్రలో ఒక కొత్త ప్రయోగమేమో.కవి బైరాగిని పునర్జీవింపజేసిన వీరభద్రుడు గారి ప్రయత్నానికి ఈ స్పందన ఒక కర్పూర మంగళ హారతి అనవచ్చు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఇలా సద్వినియోగమైనప్పుడు చాలా సంతోష మనిపిస్తుంది.ఎవరి చోట వాళ్లం ఉండి
    పొద్దున లేవగానే మంచి మనసులన్నీ పిచ్చుకలై
    ఎగిరివచ్చి అదృశ్య సాహిత్యదేవాలయాంగణ విలసిత వటవృక్షంపై వాలి, సుప్రభాత ఆగమగీతాలాపన చేసినట్లుగా ఆనందించటం అపూర్వం. నా కుటీరం ఇప్పుడొక అభినవ శాంతినికతనమనిపిస్తున్నది. వీరభద్రుడుగారికి, సమంత గారికి వినమ్ర నమస్సుమాంజలులు.

  4. ఇంత చక్కటి మాటలు ఎంతో అద్భుతమైన వివరణ… మీరు చెబుతూ ఉంటే ఎన్నో మాటలు నా మనసులో లోలోపల ఇదివరకే వచ్చి చేరి ఉన్నట్టు అనిపించింది.. తెచ్చిన పుస్తకాలను వెంటనే తెరవమని ఆజ్ఞాపించినట్టు అనిపించింది…

    కవితలు చదువుతున్నప్పుడు మీరు చెప్పే ప్రతి మాటనే కాకుండా చెప్పని ఎన్నో మాటలు వినిపించినట్టు అనిపించింది..

    వేల ఆకాశాలను ఒక్కసారి నా దోసిట్లో పోసినట్టు అనిపించింది…

    థాంక్యూ సో మచ్…
    సమంత గారు

  5. ఇప్పుడు లేని బైరాగి గారికీ మీరు పంపిన స్వర సందేశం అందేఉంటుంది. మీరన్నది నిజం బైరాగి జీవించే వున్నాడు మీలాంటి వాళ్ళ నాలుకల మీద. అభినందనలు మేడమ్ garu

  6. Ohhh My – నేను సరదాగా పంపిన లేఖను మీ blog లో పెట్టినందుకు many many thanks sir. For the small time we worked together – you are a very big influence on me 😀😀🙏🙏

  7. Your talks on Byragi is not only excellent. But more pleasant surprise is it is inspiring youngsters to read and impressed by poetry . I used to think in next few generations very few and far will read and appreciate Telugu literature. But now I am sure Telugu literature will sustain despite media and digital explosion.
    I remember Samantha and Chenchala were working with you and I met them in a lunch you hosted in Minerva when I visited your Dept.
    Regards
    Sujatha.K

  8. ఇది స్వరాభిషేకం అదీ నవ యువ గొంతుక కావడం ముదావహం

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading