
11
మొత్తం ప్రపంచమంతా దైవమే
కావలసిందల్లా చిటికెడు ఉపదేశం
మొదట నిన్ను నువ్వు నాశనం చేసుకో
అప్పుడు నువ్వేమని బదులిస్తావు?
బ్రహ్మజ్ఞానపు కొటారులాగా ఉంటావు
నువ్వు నిశ్చయంగా చెప్పగల జవాబిదే.
తుకా అంటున్నాడు: ఆ స్థితికి చేరుకున్నాక
కార్యం కారణంలో అణగిపోయింది.
जग अवघें देव । मुख्य उपदेशाची ठेव ॥१॥
आधीं आपणयां नासी । तरि उत्तरे ये कसीं ॥ध्रु.॥
ब्रम्हज्ञानाचें कोठार । तें या निश्चयें उत्तर ॥२॥
तुका म्हणे ते उन्मनी । नाश कारय कारणीं ॥३॥ (1338)
12
ఇక్కడ పలుకు మూగబోతుంది
అయినా ఎవరి తగ్గట్టువారు చెప్తారు
అద్దంలో కనిపిస్తున్న దేహం
ఎవరికి తోచినట్టు వారు చూస్తారు.
ఒక్కడు నమ్మినా చాలు
పంట అపారంగా పండుతుంది.
తుకా కళ్ళంలో ధాన్యం మధ్య కూచుని
కుప్పలు లెక్కపెడుతున్నాడు
नाहीं येथें वाणी । वर्णी घ्यावी धणी ॥१॥
जालें दर्पणाचें अंग । ज्याचा त्यासी दावी रंग ॥ध्रु.॥
एका भावाचा एकांत । पीक पिकला अनंत ॥२॥
तुका खळे दाणीं । करी बैसोनी वांटणी ॥३॥ (1340)
13
आंत हरी बाहेर हरी । हरीनें घरीं कोंडिलें ॥१॥
हरीनें कामा घातला चिरा । वित्तवरा मुकविलें ॥ध्रु.॥
हरीने जीवें केली साटी । पाडिली तुटी सकळांसी ॥२॥
तुका म्हणे वेगळा नव्हे । हरी भोवे भोंवताला ॥३॥
లోపల హరి, బయట హరి
హరి నన్ను తనలో కైదుచేసుకున్నాడు
నా కోరికల్ని బండపెట్టి అణచేసాడు
నా సంపద మొత్తం కొల్లగొట్టుకున్నాడు
నాకు బదులు తనని నాకిచ్చాడు
నాకూ లోకానికీ మధ్య గీతగీసాడు.
తుకా అంటున్నాడు: హరి వేరే లేడు
చుట్టూతా చుట్టుముట్టిఉన్నాడు.
11-2-2025

