అంటున్నాడు తుకా-4

8

వైకుంఠం వదిలిపెట్టిమరీ వచ్చి
ఇటుకమీద నిలబడ్డాడు తిన్నగా.

భక్తపుండలీకుణ్ణి కలుసుకోడానికి
జగజ్జ్యేష్ఠుడు వచ్చేసాడిక్కడికి.

వచ్చి చంద్రభాగ నది ఒడ్డున
నడుమ్మీద చేతులాన్చుకుని నిలబడ్డాడు.

తుకా అంటున్నాడు: ఆకాశమంతా
ఎడతెగని జయఘోష.

सांडूनि वैकुंठ । उभा विटेवरी नीट ॥१॥
आला आला रे जगजेठी । भक्ता पुंडलिकाचे भेटी ॥ध्रु.॥
पैल चंद्रभागे तिरीं । कट धरूनियां करीं ॥२॥
तुकयाबंधु म्हणे अंबर । गजर होतो जयजयकार ॥३॥ (3990)

9

బిడ్డ పుట్టాడని తెలియగానే
సంతోషంపట్టలేని తల్లిలాగా

హరిగుణకీర్తన వినబడుతూనే
నా మనసు తుళ్ళిపడుతుంది.

నాదం వినగానే మృగం
సర్వాంగాలూ విస్మరిస్తుంది.

తుకా అంటున్నాడు: తాబేలు పిల్లలు
బతికేది తల్లిచూపుల్తోటే.

पत्राची वार्ता । शुभ ऐके जेवीं माता ॥१॥
तैसें राहो माझें मन । गातां ऐकतां हरीगुण ॥ध्रु.॥
नादें लुब्ध झाला मृग । देह विसरला अंग ॥२॥
तुका म्हणे पाहे । कासवीचें पिलें माये ॥३॥ (3452)

10

సంత మొత్తం సరుకు దిగింది
ఇంక మనం అటూ ఇటూ తిరగక్కర్లేదు.

ఆయన వచ్చి ఇటుకమీద నిలబడ్డాడు
ఈ పండరి మొత్తం తన జాగీరు.

వీథులన్నీ నిండిపోయాయి.
మొత్తం జగమంతా మూర్ఛిల్లింది.

తుకా అంటున్నాడు: నాన్నా, చక్కని
సరుకు కావాలంటే నిక్కమైన కుంచం తెచ్చుకో.

आले भरा केणें । येरझार चुके जेणें ॥१॥
उभें केलें विटेवरी । पेंठ इनाम पंढरी ॥ध्रु.॥
वाहाती मारग । अवघें मोहोरलें जग ॥२॥
तुका म्हणे माप । खरें आणा माझे बाप ॥३॥ (647)

9-2-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading