
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా 6-2-2025 సాయంకాలం బైరాగి రాస్కల్నికోవ్ కవితపైన ఫేస్ బుక్ లైవ్ ప్రసంగం చేసాను. మానవుడికి కర్మక్షేత్రంలో కలిగే సందేహావస్థల్లో కర్మచేయకముందే సందేహానికి లోనయిన స్థితి హామ్లెట్ ది కాగా, కర్మ చేసిన తరువాత సంశయగ్రస్తుడవడం రాస్కల్నికోవ్ పరిస్థితి. కర్మక్షేత్రం మధ్యలో సంశయానికి లోనైనవాడు అర్జునుడు. 1950 ల్లో బైరాగి రాసిన కవితలనుంచి వర్తమాన సమాజం నేర్చుకోవలసిందేమైనా ఉందా అన్నది ఈ ప్రసంగంలో ప్రధాన వక్తవ్యాంశం. ప్రసంగంలో భాగంగా రాస్కల్నికోవ్ కవితకు నేను చేసిన భావార్థాన్ని కూడా వినిపించాను.
ఈ ప్రసంగం ఫేస్ బుక్ లైవ్ లో భాగంగా వినలేకపోయిన మిత్రుల కోసం ఇక్కడ పంచుకుంటున్నాను.
8-2-2025

