
బైరాగి కవిత్వం పైన చేస్తున్న ప్రసంగ పరంపరలో భాగంగా కిందటి మూడువారాలు బైరాగి కవిత్వ నేపథ్యంగురించీ, హామ్లెట్ స్వగతం గురించీ ప్రసంగించాను. నిన్న ‘రాస్కల్నికోవ్’ కవిత గురించి ప్రసంగించాను.
ఈ ప్రసంగం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో అంటే నిన్నటి ప్రసంగంలో రాస్కల్నికోవ్ పాత్ర సృష్టి కర్త అయిన ఫ్యొదోర్ డాస్టొవిస్కి (1821-1881) గురించీ, అతడి సాహిత్యం గురించీ స్థూలంగా ప్రస్తావించేక, అతడి ప్రసిద్ధ నవల Crime and Punishment (1866) ను పరిచయం చేసాను .
ఆ నవల ద్వారా డాస్టొవిస్కీ పరిష్కరించాలనుకున్న తన ఆంతరంగిక ప్రశ్నలను రాస్కల్నికోవ్ పాత్ర ద్వారా ఏ విధంగా వ్యక్తీకరించాడో వివరంగా చెప్పుకుంటే, అప్పుడు ఆ నేపథ్యంలో బైరాగి రాసిన రాస్కల్నికోవ్ కవితను మరింత బాగా అర్థం చేసుకోడానికి వీలవుతుంది. కాబట్టి నిన్నటి ప్రసంగంలో రాస్కల్నికోవ్ పాత్ర గురించి వివరించాను. తదుపరి ప్రసంగంలో బైరాగి కవిత గురించి వివరిస్తాను.
ఈ ప్రసంగాల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా నమోవాకాలు.
Featured image: Siberian landscape, Watercolor painted by Maksymilian Oborski (around 1868), Wikimedia commons
25-1-2025

