అతని పంట కన్నుల పంట

ఇన్నాళ్ళకు, ఇదుగో, ఒక రచయిత తన యాభయ్యవ పుస్తకం విడుదలచేస్తే ఒక సాహిత్య పత్రిక దాన్నొక వార్తగా భావించి ఆ రచయితని ఇంటర్వ్యూ చేసింది. నా దృష్టిలో ఒక పత్రిక ఇలా ఇంటర్వ్యూ చేయడమే ఒక పెద్ద వార్త! ఈ ఖ్యాతి అఫ్సర్ దే!

రారా పోదాం రారా పోదాం

వారం రోజుల కిందట మూలా సుబ్రహ్మణ్యం మా ఇంటికొచ్చాడు. ఆయన వస్తున్నాడని తెలిసి నందకిశోర్ కూడా వచ్చాడు. నందూ వచ్చాక పాటలు రాకుండా ఎలా ఉంటాయి?

ఆ వెలుగుల కోసమే

ఈలోగా గత పుష్కరకాలంగా నేను అప్పుడూ అప్పుడూ మిత్రుల్తో పంచుకుంటూ వస్తున్న నా విద్యానుభవాల్ని ఒక సంపుటంగా వెలువరించాలనుకున్నాను. ముఖ్యంగా మా దేవమ్మ డా.నన్నపనేని మంగాదేవిగారికి ఆ పుస్తకం కానుక చెయ్యాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. నిన్న శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వారి లలితకళా ఉత్సవంలో ఈ పుస్తకాన్ని మా అక్క ఆవిష్కరించి నా తరపున ఆమెకు సమర్పించింది. ఇది నా 51 వ పుస్తకం. దీన్నిక్కడ ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. 45 వ్యాసాలు. 216 పేజీలు. దీన్ని మీ మిత్రుల్తో, మీ సంస్థల్లో, మీ ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తల్తో, ఉపాధ్యాయుల్తో పంచుకుంటారని ఆశిస్తున్నాను.