
రెండున్నరవేల ఏళ్ళ కిందట ఏథెన్స్ లో ఒక యువనాటక కర్త రచనకి బహుమతి వచ్చిన సందర్భంగా అతణ్ణి అభినందించడానికి అతడి మిత్రులు కలుసుకున్నారు. ఇప్పట్లానే అప్పుడు కూడా అటువంటి గోష్ఠి పానగోష్ఠిగా మారకుండా ఎలా ఉంటుంది? కాని సోక్రటీస్ కూడా ఆ గోష్ఠికి హాజరయినవాళ్ళల్లో ఉన్నాడు. ఆయన వల్ల ఆ పానగోష్ఠి అజరామరమైన ప్రేమగోష్ఠిగా మారింది. ఆ సంభాషణని సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ‘సింపోజియం’ అనే ఒక అత్యున్నత సాహిత్యకృతిగా మలిచాడు.
ఇప్పుడు ఆ రచనని మొదటిసారిగా తెలుగులోకి అనువదించే భాగ్యం నాకు కలిగింది. ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొదలవుతున్న సందర్భంగా ఆ అనువాదాన్నిలా ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఆ సంభాషణ నేపథ్యాన్ని, తాత్త్విక ప్రాసంగికతని వివరిస్తూ నేను రాసిన ఒక సుదీర్ఘ పరిచయ వ్యాసం కూడా ఉంది.
ఈ ‘ప్రేమగోష్ఠి’ నా 52 వ పుస్తకం.
దీన్ని మిత్రులు కల్యాణి నీలారంభంగారికి అంకితమిస్తున్నాను. ఆమె తానున్నచోటునే ఒక ఏథెన్సుగా మార్చగల విద్వన్మణి.
ఈ పుస్తకాన్నిక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులకు కానుకగా పంపవచ్చు. 108 పేజీలు మాత్రమే. ఒక్క సిట్టింగులో చదివేయవచ్చు.
మిత్రులారా! నేను అనువాదాల్లో పడి కొట్టుకుపోతున్నాను అనుకోవద్దు. జి.వి.కృష్ణారావుగారితో సహా ఎందరో ప్లేటో పండితులు ఈ పుస్తకాన్ని అనువదించకుండా వదిలిపెట్టడం నా భాగ్యం తప్ప మరేమీ కాదు.
18-12-2024


క్షమించాలి!అనువాదాలతో సమానంగా సృజన కూడా సాగాలని మనవి!
తప్పకుండా సార్!
అనువాదం కూడా ఒక సృజననే. ప్రపంచ సాహిత్యంతో పరిచయం లేకుండా తెలుగు వాళ్ళు రచనలు చేస్తున్నందువలనే అవి అంత బోలుగా, నిస్సారంగా, కొన్నిసార్లు విద్వేషపూరితంగా ఉంటున్నాయి.
“దీన్ని మిత్రులు కల్యాణి నీలారంభంగారికి అంకితమిస్తున్నాను. ఆమె తానున్నచోటునే ఒక ఏథెన్సుగా మార్చగల విద్వన్మణి.”
కల్యాణి నీలారంభం గారి గురించి ఎంత మంచి మాట చెప్పారు. ఆవిడ ఎఫ్బి పేజిని కూడా అంత చక్కని వేదిక చేసేవారు. ఆవిడ రాసిన ఒక వాక్యం ఓ రెండు పుస్తకాలు చదివేలా చేస్తుంది..
‘ప్రేమ గోష్ఠి’ ని చదువుతాను. ప్లేటో ని చదువుతుంటే ఓ సమావేశం లో ఉన్న అనుభూతి కలుగుతుంది నిజం గానే.
ధన్యవాదాలు.🙏
ధన్యవాదాలు మేడం
Gd mrng sir
Whatever you write, I will find soul in that
Thank you very much sir
Thank you so much!