అది కూడా వివరిస్తాను సోక్రటీస్. ఇప్పటిదాకా ప్రేమ ప్రాదుర్భావం గురించి చెప్పాను. ప్రేమ ఒక సౌందర్యదాహం అని నువ్వు కూడా ఒప్పుకున్నావు. కాని ఎవరేనా అడగొచ్చు: సౌందర్యదాహం, నిజమే, కాని ఎవరి సౌందర్యం పట్ల? సోక్రటీసులోనా, లేక డయొటిమాలోనా? లేదా మరోలా అడగాలంటే, ఒక మనిషి అందాన్ని ప్రేమిస్తున్నప్పుడు, అతడు కోరుకుంటున్నదేమిటి?
