ప్రతి ధనుర్మాసంలోనూ ఆండాళ్ తల్లినీ, తిరుప్పావైనీ తలుచుకోవడం నాక్కూడా చాలా ఏళ్ళుగా ఒక వ్రతంగా ఉంటున్నది. ఈసారి కూడా, మీతో తిరుప్పావై గురించి నా ఆలోచనలు పంచుకుందామని ఉంది.
అమరధామం
నాకు తెలిసినంతమటుక్కి, ప్రపంచ మహానగరాలన్నిటిలో ఒక రాజమండ్రిలోనే ఈ మృత్యుంజయగాథకి మహత్వం సిద్ధించింది.
అపరాహ్ణరాగం
నా జీవితంలో ఎంతోమందిని చూసాను, ఎందరో బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు. కానీ ఇప్పుడు ఈ క్షణాన్న వాళ్ళ ముఖం ఒక్కటి కూడా నా కళ్ళముందు కనిపించడం లేదు. కాని ఆ ఏకాంత అపరాహ్ణం, ఆ నిశ్శబ్దగ్రామసీమ అవి నా కోసం ఎన్నటికీ చెరగని నీడ పరిచినట్టనిపిస్తుంది. నేను ఆగిపోయిందక్కడ, ఆ నీడ దగ్గర, ఆ గూడు దగ్గర, ..’
